వైసీపీ కార్పొరేటర్ అనిల్‌ను కొట్టిన టీడీపీ నాయకులు

83చూసినవారు
వైసీపీ కార్పొరేటర్ అనిల్‌ను కొట్టిన టీడీపీ నాయకులు
AP: తిరుపతిలో వైసీపీ నేతపై టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. 50వ డివిజన్ కార్పొరేటర్ అనిల్‌ను విచక్షణారహితంగా టీడీపీ నాయకుడు రత్నం, అతని కుమారుడు విజయ్ కొట్టారు. తన కొడుకుని కొట్టొద్దంటూ అడ్డు వెళ్లిన అనిల్ తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలతో తల్లీకొడుకు ఆసుపత్రిలో చేరారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆసుపత్రిలో అనిల్ ను పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్