ఈ నెల 27 నుంచి కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ కి ప్రమోషన్ దక్కనుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యువతకు ప్రాధాన్యత ఇస్తూ, కొత్త తరం నాయకత్వాన్ని వెలికి తీసుకురావడమే ఈ మహానాడు ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా కలసి, వారి సమస్యలు తెలుసుకున్న లోకేష్,యువతలో విశేష ఆదరణను సంపాదించారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా నాయకత్వం భావిస్తోందని సమాచారం.