AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి వెనుక MLA ధూళిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని YCP నేత అంబటి మురళీ ఆరోపించారు. ఇటీవల ఓ సభలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని భూస్థాపితం చేయాలని టీడీపీ నేతలకు MLA చెప్పారని ఓ వీడియోను విడుదల చేశారు. అతనిపై దాడి జరిగితే పోలీసుల నుంచి సరైన వివరణ లేదని మండిపడ్డారు. ఈ కేసులో MLAను ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.