నగరిలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేత, నగరి ఎమ్మెలే గాలి భానుప్రకాశ్ తమ్ముడు జగదీశ్ వైసీపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నట్లు సమాచారం. జగదీశ్ వైసీపీలోకి వచ్చేందుకు ఓ ముఖ్యనేత కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఒకవేళ జగదీశ్ వైసీపీలోకి వస్తే టీడీపీకి భారీ షాక్ తగిలినట్టే అవుతుంది.