AP: కృష్ణా జిల్లా పామర్రు టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పామర్రులో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించారు. ఆయన గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈరోజు కూడా ఆయన ఎండలోనే వివిధ గ్రామాల్లో పర్యటించడంతో అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది.