AP: శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే లేకుండా ఎంపీ కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణను అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఎంపీ శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అధినేత చంద్రబాబు వద్దకు పిలిపించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.