టీడీపీ ఎంపీ జగన్‌కు సన్నిహితుడైన టాలీవుడ్ స్టార్‌కు సాయం చేసి చిక్కుల్లో పడ్డారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తాజాగా హీరో నాగార్జున కుటుంబాన్ని తీసుకుని ప్రధాని మోదీ వద్దకు వెళ్లారు. అక్కినేని కుటుంబ సభ్యులందరినీ తీసుకుని లావు కృష్ణదేవరాయలు ఇలా ప్రధాని మోదీ వద్దకు వెళ్లడం వివాదాస్పదమైంది. నాగార్జునకు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఫ్యామిలీతో సహా ప్రధాని మోదీ వద్దకు టీడీపీ ఎంపీ తీసుకెళ్లడం ఏంటనే చర్చ జరుగుతోంది.
,