AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 మంది నిందితులు విజయవాడ కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.