సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులర్పించనుంది. అనంతరం మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరగనుంది. అలాగే 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్ పై సీఎం చర్చించనున్నారు. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు పార్టీ సీనియర్ నేతలతో మంత్రి నారా లోకేశ్ భేటీ కానున్నారు.