ఎన్ని తరాలు మారినా డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి రోజా నొక్కి చెప్పారు. గత 5 సంవత్సరాలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా తమ 'రెడ్ బుక్ రాజ్యాంగం'ను అమలు చేస్తోందని విమర్శించారు.