టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు టీడీపీ కార్యకార్తె కారణం: వైసీపీ

51చూసినవారు
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు టీడీపీ కార్యకార్తె కారణం: వైసీపీ
AP: ప్రేమోన్మాది వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. ఈ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. వేధింపులకు కారణమైన తారకరత్న అనే యువకుడు అధికార టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ ఆరోపిస్తోంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడు సంజీవరెడ్డితో అతడు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తోంది.

సంబంధిత పోస్ట్