AP: టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభం నాటికి టీచర్ పోస్టుల భర్తీ చేపడతామన్నారు. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేపడతామన్నారు. సంక్రాంతి నాటికి ఆర్ అండ్ బీ రోడ్లపై గుంతలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కవ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని, ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదని కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు చెప్పారు.