ఏపీలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయాల ముట్టడికి పిలుపు ఇచ్చారు. SGTల బదిలీలు మాన్యువల్ విధానంలో జరగాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో ఓ ఉపాధ్యాయుడు తలకిందులుగా ఉండి ఆందోళన వ్యక్తం చేయడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. కొన్నిచోట్ల టీచర్ల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి.