TG: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం 9గం. వెళ్లాల్సిన విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విమానంలో టాలీవుడ్ విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు, పలువురు అధికారులు ఉన్నారు. విజయ్ తన అమ్మతో కలిసి కుంభమేళాకి వెళుతున్నట్లు తెలిసింది.