ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసన మండలి ఆమోదం తెలిపింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా స్పందించింది. కాగా, ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనతో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసి, ఫైనల్ రిపోర్టును సబ్ కమిటీకి అందజేసింది.