తెలుగు క్రీడాకారిణులు జీవాంజి దీప్తి, జ్యోతి యర్రాజి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 32 మందికి ఈ అవార్డులను ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి వీరు చోటు దక్కించుకున్నారు. వరంగల్కు చెందిన దీప్తి పారా అథ్లెటిక్స్ విభాగంలో, విశాఖకు చెందిన జ్యోతి అథ్లెటిక్స్లో ఎంపికయ్యారు. జనవరి 17న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.