తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

57చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ రాబోయే రెండ్రోజులు 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్