AP: రాబోయే 2 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వేడి వాతావరణం నెలకొందని వెల్లడించింది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదయినట్లు తెలిపింది. నందిగామలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.