మెక్సికోకు సుంకాల విధింపు తాత్కాలికంగా నిలిపివేత

68చూసినవారు
మెక్సికోకు సుంకాల విధింపు తాత్కాలికంగా నిలిపివేత
మెక్సికో, కెనడాలతోపాటు చైనాపైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో మెక్సికోకు ప్రస్తుతానికి తాత్కాలికంగా భారీ ఊరట లభించింది. మెక్సికోపై సుంకాల విధింపును నెల రోజులపాటు నిలిపివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆ దేశ అధ్యక్షురాలు షీన్బామ్‌తో స్నేహపూర్వక ఫోన్ కాల్ చర్చలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్