ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ - బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలింగ్ కేంద్రాల్లో నగదు పంపిణీతో పాటు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు బహిరంగంగా దాడులకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.