పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు జరిపారు. ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.