ఎలిగేటర్లు, మొసళ్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు మాత్రం మొసళ్లతో కూడా ఆడుకుంటూ కనిపిస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆవేశంగా సమీపానికి వచ్చిన ఎలిగేటర్.. ఓ యువతిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. తీరా దాడి చేసే సమయంలో సదరు యువతి ఎలిగేటర్‌పై చేయి పెడుతుంది. ఆమె చేయి వేయడంతో ఒక్కసారిగా ఎలిగేటర్ కూల్ అవుతుంది.