2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ మొత్తం రూ.2,91,159 లక్షల కోట్లుగా రూపొందించారు. ఈ బడ్జెట్ ను జూన్ 25న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. రూ.72,659 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. సంక్షేమానికి కూడా రూ. 40 వేల కోట్లు కేటాయించారు.