ఢిల్లీలోని షాదరా బిహారీ కాలనీలో ఓ భవనం ఒక వైపు వంగిపోవడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం నివారించేందుకు వెంటనే భవనాన్ని ఖాళీ చేయించారు. భవనానికి తాత్కాలికంగా జాక్‌లు ఏర్పాటు చేశారు. ఇతర శిథిల భవనాలకూ నోటీసులు జారీ చేశారు. భవనం ఎందుకు వంగిందనే విషయంపై విచారణ చేపట్టారు. భవనం సురక్షితం కాదని, త్వరలో కూల్చేస్తామని MCD తెలిపింది. ఆ ప్రాంతంలో ఉన్న శిథిల భవనాలపై అధికారుల డ్రైవ్ కొనసాగుతోంది.