AP: మచిలీపట్నం పార్టీ ఆఫీసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో 11మంది పోలీస్‌లను సస్పెండ్ చేయడంచూస్తే కూటమి పాలన అర్థం అవుతోందన్నారు. 'చంద్రబాబు ఎవరినైనా ఎర వేస్తాడు, ఎవరినైనా బలిచేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు. అధికారి, బంధువు, పోలీస్, కార్యకర్త ఇలా ఎవరైనా చంద్రబాబుకి ఒకటే. దొంగ కేసులు పెట్టడం కొట్టడం తిట్టడం వంటివి చేస్తున్నారని' ఆయన విమర్శించారు.