70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా 'కార్తికేయ 2' ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మేం ఊహించని పురస్కారం ఇది. ఈ పురస్కారాన్ని శ్రీకృష్ణ భగవానుడికి, ఆ తర్వాత మా చిత్రబృందానికీ అంకితం ఇస్తున్నా" అని తెలిపారు. సినిమాకి జాతీయ పురస్కారం లభించాక తనకు పాన్ ఇండియా స్థాయిలో ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.