AP: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను తిరిగి విలీనం చేయడంపై ఎన్నికల కోడ్ తర్వాత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం ఆయా క్లాసులను యూపీహెచ్, హైస్కూళ్లలో కలిపేయడంపై వివాదం తలెత్తింది. ఇక పదో తరగతి విద్యార్థులకు సెలవుల్లో ప్రత్యేక క్లాసులు తీసుకున్న టీచర్లకు సీసీఎల్ ఆప్షన్ కల్పిస్తామని అధికారులు తెలిపారు. టీచర్ల బదిలీలపై ప్రైమరీ సీనియారిటీ జాబితాను ఎన్నికల కోడ్ తర్వాత విడుదల చేయనున్నారు.