పోస్ట్ మీది పోరాటం మాది: వైసీపీ

84చూసినవారు
పోస్ట్ మీది పోరాటం మాది: వైసీపీ
AP: వైసీపీ సరికొత్త ప్రచారంతో ముందుకు వచ్చింది. అధికారమదంతో కూటమి నేతలు ఊరూరా దాడులు, దౌర్జన్యాలకి పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. బాధితులకు అండగా ఉంటామని ఎక్స్ వేదికగా కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. ‘‘ పోస్ట్ మీది పోరాటం మాది. మీ ఊరిలో కూటమి నేతలు దౌర్జన్యం చేస్తే ఫొటోలు, వీడియోలు తీసి #KutamiFiles #ConstituencyName ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి’’ అని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్