AP: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ చెప్పారు. అసలు నువ్వు ఎవరివి పవన్.. జగన్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని అనడానికి. ఒకరిని సీఎం చేయాలన్నా.. వద్దన్నా.. అంతిమ తీర్పు ప్రజలదే. ఈ విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకోవాలి.’ అని అన్నారు.