AP: క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమమేథలో వచ్చే పదేళ్లలో ఏపీని నెంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ పై సచివాలయంలో ఐటీ రంగ నిపుణులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలని సీఎం చంద్రబాబు తెలిపారు.