ఏడాదిగా సర్కార్ ప్రజలను వంచిస్తూనే ఉంది: భూమన

51చూసినవారు
ఏడాదిగా సర్కార్ ప్రజలను వంచిస్తూనే ఉంది: భూమన
AP: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉందని భూమన కరణాకర్ రెడ్డి విమర్శించారు. 'జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 2 కోట్ల 7 లక్షల మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసగించారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్