ఏపీ హజ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్‌గా మంగళవారం షేక్ హసన్ భాషాను నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం ఏపీ హజ్ కమిటీ యాక్టు ప్రకారం 13 మంది హజ్ కమిటీ సభ్యులను నియమించింది. వీరు 3 సంవత్సరాలు ఈ పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.