ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, నాలుగు నెలలుగా వారికి వేతనాలు లేవు. ఉద్యోగాల కొనసాగింపు పైన స్పష్టత లేదు. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో విధుల్లోకి తీసుకునే వాలంటీర్ల సంఖ్యతో పాటుగా వారికి స్కిల్ శిక్షణ, విధుల ఖరారుపైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.