దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఏపీలో నమోదు

71చూసినవారు
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఏపీలో నమోదు
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏపీలోని నంద్యాల జిల్లాలో నమోదయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరులో నిన్న 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో 40, కృష్ణా జిల్లా కంకిపాడులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావారణ శాఖ తెలిపింది. రాష్ట్రంపైకి పొడిగాలులు వీయడం వల్లే ఎండలు మండిపోయినట్లు పేర్కొంది. ఇవాళ కూడా సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్