AP: దేశంలో పేరున్న పొలిటికల్ కన్సల్టెన్సీ టీమ్ ‘ఐప్యాక్’. 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున జగన్ కోసం ఏపీలో గ్రౌండ్ వర్క్ చేసింది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించగా.. 2024లో ఘోరంగా ఓడిపోయింది. ఐప్యాక్ వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. తాజా సమాచారం ప్రకారం ఐప్యాక్ టీమ్ జగన్ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ విషయం అటు వైసీపీలోనూ.. ఇటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.