ఏపీ పాలిటిక్స్‌లో బిగ్ న్యూస్ ఇది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను ఓడించిన సీనియర్ నేత గ్రంధి శ్రీనివాసరావు టీడీపీలో చేరనున్నారని సమాచారం. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంధి 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన గ్రంధి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం భీమవరంలో టీడీపీకి బలమైన నేత లేకపోవడంతో గ్రంధి చేరికకు టీడీపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు.