వరుసగా మూడోసారి ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరాట పడుతుండగా, పూర్వవైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఈ మూడు పార్టీలు పోటీపడి మరీ హామీలు గుప్పించాయి. ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. బీజేపీ విజయం కోసం మోడీ, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం CBN ప్రచారం చేశారు.