AP: కర్నూలు జిల్లా గుడికల్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మరదలు పెళ్లికి నిరాకరించిందని నల్లన్న అనే వ్యక్తి మరదలు కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. అయితే నల్లన్నకు ఇప్పటికే రెండు పెళ్లిలు కాగా.. విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి మరదలను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. పెళ్లి సంబంధాలను సైతం చెడగొట్టుతుండటంతో మరదలు కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో నల్లన్న కర్రలతో వారిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.