బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విశేష కృషి చేశారు. దీంతో నిమ్మలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడను ముంచేసిన బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు మంత్రి ఆరో రోజులుగా గట్టుపైనే ఉన్నారు. భారీ వర్షాలు, వరదలను సైతం లెక్క చేయకుండా పనులు నిత్యం పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలిస్తూ గండ్ల పూడిక పనులను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఆకస్మిక వరద వచ్చిన తట్టుకునేలా గట్లను బలోపేతం చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు మంత్రి నిమ్మల పనితీరును నారా లోకేష్ ప్రశంసించారు.