ఏపీలో వరదల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు సైతం ప్రజల సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు వర్షంలో తడుస్తూ బుడమేరు గండ్లు పూడిక పనులు చేయించారు. అర్ధరాత్రి భారీ వర్షం, ఉదృత గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.