సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. యువతి ఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లి దుకాణాల పైకి ఎక్కి కూర్చుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కోతిపైకి ఫ్రూటీ విసిరాడు. అయితే దాన్ని కోతి పట్టుకునేలోపే కిందపడిపోయింది. మళ్లీ ఇంకో పండును విసిరారు. దీంతో ఆ కోతి పండుని పట్టుకుని ఫోన్‌ని వదిలేసింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఈ కోతి చాలా తెలివైనదని కామెంట్లు పెడుతున్నారు.