AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండిందని, ఇక ఆయనకు క్షమించేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ప్రజలను దోచుకున్న వ్యక్తి ఇప్పుడు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 2023లో బదిలీ అయిన తహశీల్దార్ 2024లో ఎలా పట్టాలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. నిజంగా పేదలపై ప్రేమ ఉంటే 6,400 టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు.