AP: కూటమి ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తయిన వేళలో నిర్వహించే సభకు ‘సుపరిపాలన- తొలి అడుగు’ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. అంతకు ముందు సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. పేరులో మార్పులు చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రొటోకాల్ విభాగాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.