AP: కూటమి ప్రభుత్వం పై వైసీపీ చేస్తోన్న విమర్శలకు టీడీపీ నేత పట్టాభి రామ్ కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడిని ఒకసారి ఎగ్గొట్టిందని, కోతలు పెట్టుకుంటూ అమలు చేసిందన్నారు. వారి హాయంలో టాయిలెట్ల నిర్వహణ పేరుతో రూ.2,178 కోట్లకు కోత పెట్టారని, ఆ కట్ చేసిన డబ్బులు ఎక్కడికెళ్లాయో తెలియదని పట్టాభి అన్నారు. వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా 42.61 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే, తమ ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తోందని అన్నారు.