AP: అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలోనే 80 శాతం వరకు పూర్తి చేశామన్నారు. స్త్రీశక్తి ద్వారా అన్నింటిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, ఒక్కరికి మాత్రమే ‘అమ్మ ఒడి’ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మహిళలను అవమానపరిచేలా వైసీపీ చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.