స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ (17), ఇందిరా గాంధీ (16) మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ కంటే ఎక్కువ సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత్ ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది.