నలుగురి స్వార్థం కోసం ధరణి తీసుకొచ్చారు: పొంగులేటి

79చూసినవారు
నలుగురి స్వార్థం కోసం ధరణి తీసుకొచ్చారు: పొంగులేటి
TG: నలుగురి స్వార్థం కోసం ధరణి తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూ సమస్యలపై రైతులు కోర్టులను కూడా ఆశ్రయించారని అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని పొంగులేటి వెల్లడించారు. 'ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించాం. భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం దక్కనుంది. కబ్జా చేసిన భూములను బయటకు తీస్తాం.' అని పొంగులేటి తెలిపారు.

సంబంధిత పోస్ట్