తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం

51చూసినవారు
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం
ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. అదేవిధంగా రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తెలిపింది. సర్వదర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వెల్లడించింది. నిన్న(బుధవారం) 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్