ఏపీలోని కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొత్తం మద్యం షాపుల్లో 340 దుకాణాలను కల్లు గీత కార్మికులకు రిజర్వ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల గడువును కూడా పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 8వ తేదీ వరకు ఈ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 9న దరఖాస్తుల పరిశీలన.. 10న షాపుల కేటాయింపునకు సంబంధించి డ్రా తీయనున్నారు.