AP: కూటమి పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టులో ఉచిత బస్సులు వస్తాయని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దిగజారిందని, మరో శ్రీలంకగా మారబోతుందన్నారు. వ్యాపారాలు నడవట్లేదని, ప్రజలు మళ్లీ అప్పుల్లో మునుగుతున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు 80 శాతం అమలయ్యాయని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.